యంగ్ హీరోలలో మినిమం గ్యారంటీ హీరోగా శ్రీవిష్ణు పేరు సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. యువత మెచ్చే కథాంశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ శ్రీవిష్ణు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన థియేటర్లలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న రాజ రాజ చోర జీ5 ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సంపాదించుకున్న రాజ రాజ చోర నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
ఏదైనా కారణం చేత థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ‘ జీ 5 ’ ఓటీటీ వేదికలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించగా మేఘా ఆకాష్, సునైనా హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైన్మెంట్ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండటం గమనార్హం.
ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వారికి రాజ రాజ చోర కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూడటానికి ఉన్న బెస్ట్ సినిమాలలో రాజ రాజ చోర ఒకటని చెప్పవచ్చు. జీ5 ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు భారీగా వ్యూస్ వస్తున్నట్టు తెలుస్తోంది. గంగవ్వ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, రవిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు