మెగా డాటర్ శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నప్పటికీ ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందించలేదు. అయితే వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారని కానీ ఈ విషయాన్ని ఫ్యామిలీ బయట పెట్టలేదని విషయం తెలుస్తుంది. ఇలా శ్రీజ కళ్యాణ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోవడంతో పిల్లలు శ్రీజవద్దే ఉంటున్నారు.
శ్రీజ ఇదివరకే ఒక పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమెకు అప్పటికే ఒక కుమార్తె ఉన్నారు. తిరిగి కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది ఇలా వీరిద్దరి కుమార్తెలను శ్రీజ ప్రస్తుతం తన వద్ద ఉంచుకున్నారు అయితే విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కళ్యాణ్ దేవ్ మాత్రం తన ఇద్దరు కుమార్తెలను చాలా మిస్ అవుతున్నాను అంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న విషయం మనకు తెలిసిందే.
కళ్యాణ్ దేవ్ సొంత కుమార్తె నవిష్క అయినప్పటికీ నివృత్తిని కూడా సొంత కూతురుగానే భావించి తనతో ఎంతో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు.ఇలా తరచూ తన కూతుర్లను మిస్ అవుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తన బాధను బయటపెట్టే కళ్యాణ్ తాజాగా మరొక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కూతుర్లను మిస్ అవుతున్న విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈయన ఒక వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోలో భాగంగా ఓ చిన్నారి స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్లో భాగంగా వేదికపై డాన్స్ చేస్తూ ముందు ఉన్నటువంటి తన తల్లిదండ్రులను చూసి ఎంతో ఎమోషనల్ అవుతారు. ఈ వీడియోని ఈయన షేర్ చేస్తూ పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలని తాను నవిష్క, నివృత్తి ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా కళ్యాణ్ దేవ్ నివృత్తిని సైతం తన కుమార్తెగా భావించి తన కుమార్తెలను మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?