Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

‘వరిసు’/ ‘వారసుడు’ సినిమా కొబ్బరి కాయ కొట్టినప్పటి నుండి సినిమా విడుదలైనంత వరకు హీరోయిన్‌ రష్మిక మందన విజయ్‌ నామ జపం చేస్తూనే ఉంది. మీరు కూడా గమనించే ఉంటారు. విజయ్‌ అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఉండటమే దానికి కారణం. అయితే ఆ అభిమానాన్ని చూపించడంలో అప్పట్లో ఆమె అతి చేసిందని కొన్ని కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు అచ్చంగానే ఇలానే పవన్‌ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేస్తోంది శ్రీలీల. ఇద్దరూ కలసి నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రచారంలో ఈ కార్యక్రమం భారీగానే సాగింది.

Sreeleela

పవన్‌ కల్యాణ్‌ గతంలో సినిమాల్లో వేసుకున్న డ్రెస్‌లు ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయన్న శ్రీలీల… ఆయన ‘ఖుషి’ సినిమా అంటే ఇష్టమని చెప్పింది. ‘జల్సా’ సినిమాలో ఇలియానాతో ఉండే కొన్ని సీన్స్‌ సరదాగా ఉంటాయని చెప్పింది. ఆమె అమ్మ పవన్‌ అభిమానే అని, ఆయనతో సినిమా చేస్తున్నా అని చెప్పగానే తన కంటే ఎక్కువ సంతోషించింది అమ్మే అని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌తో ఫస్ట్‌ సీన్‌ చేస్తున్నప్పుడు ఆశ్చర్యంతో అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయానని చెప్పింది శ్రీలీల.

పవన్‌ కల్యాణ్‌కి బిడియం ఎక్కువ అని, అయితే ఓ సీన్‌ మీ ఫ్యాన్స్ కోసం అని చెప్పగానే చేసేస్తారని సెట్స్‌లో విషయాలు చెప్పుకొచ్చింది. ఆయనకు జోడీగా నటించాలని ప్రతి హీరోయిన్‌ కలలుకంటుందని, నాకు ఇప్పుడు అవకాశం తనకు వచ్చిందని ఆనందపడిపోయింది. పవన్‌ చిన్న విషయాలను కూడా ఆస్వాదిస్తారని, షూటింగ్ సమయంలో చెట్లను చూసి మురిసిపోతూ ఉండేవారని చెప్పింది.

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఫ్యాన్స్‌కు పండగే’ అని పవన్‌ ఫ్యాన్స్‌ను ఖుష్‌ చేసే పనిలో పడింది. ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమా రీమేక్‌లో నటించే అవకాశం వస్తే ‘జల్సా’, ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలని ఉందని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే మాస్‌, క్లాస్‌ రెండూ కలిసిన బాస్‌ అని పొగిడేసింది. అలా ఆమె రీసెంట్‌ ఇంటర్వ్యూ మొత్తం పవన్‌ పేరుతో మారుమోగిపోయింది.

మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus