స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ఈ మధ్య ఎక్కువగా వినిపించే గాసిప్స్ రెండే రెండు. ఒకటి బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ తో ఆమె డేటింగ్లో ఉందని..! ఇంకోటి.. ఆమె తన తల్లి కంట్రోల్లో ఉంటుందని..! మొదటిది ఆమె పర్సనల్ వ్యవహారం. దీంతో ఇండస్ట్రీ జనాలకి పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ రెండో దాని విషయంలో ఇండస్ట్రీ జనాలు సైతం అసంతృప్తితో ఉన్నారు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. శ్రీలీలతో కమ్యూనికేట్ అవ్వాలనుకునే దర్శకులకు, నిర్మాతలకు శ్రీలీల తల్లి స్వర్ణలత అడ్డుగోడగా ఉంటున్నారని కామెంట్స్ వినిపించాయి.
వాస్తవానికి హీరోయిన్ల విషయంలో తల్లుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన టాపిక్ కాదు. సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుండి వినిపిస్తున్నదే. కానీ శ్రీలీల తల్లి విషయంలో కొన్ని ఎక్కువ కంప్లైంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో స్వయంగా శ్రీలీల క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. శ్రీలీల మాట్లాడుతూ.. “మా అమ్మ స్వర్ణలత గారు తీసుకునే డెషిషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. మంచి కథలు ఎంపిక చేసుకునేందుకు అవి సహాయపడతాయి.
అలా అని ఆమె అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతుంది అని అనడం కరెక్ట్ కాదు. ఎక్కడ పాస్ ఇవ్వాలో, ఎక్కడ స్పేస్ ఇవ్వాలో ఆమెకు తెలుసు. అలాగే మా అమ్మ నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం, డెసిషన్స్ తీసుకోవడం కూడా తప్పేమి కాదు. ఏ తల్లైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు దక్కాలని తాపత్రయపడుతుంది.అలాగే క్షేమం కోసం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతే కానీ మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.