Sreeleela: నేటిజన్ ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పిన శ్రీ లీల!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి శ్రీ లీల ఒకరు. ఒకవైపు ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా విడుదల అవుతూ ఉండగా మరోవైపు వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. తాజాగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తరువాత త్వరలోనే ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా నవంబర్ 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు ఇంటర్వ్యూలకు హాజరవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా అభిమానులతో ముచ్చటిస్తూ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈమె అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ మీరు బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తున్నారా అని ప్రశ్నించగా అవును ఆదికేశవ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తున్నానని తెలియజేశారు. అదే విధంగా మరొక నెటిజన్ మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారా అంటూ (Sreeleela) ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీలీల సమాధానం చెబుతూ..

అవును తాను కమిట్మెంట్ ఇచ్చానని, తాను తన పనులకు కమిట్మెంట్ ఇచ్చాను అంటూ ఈ సందర్భంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీ లీల కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు. ఈమె కెరియర్ విషయానికి వస్తే త్వరలోనే ఆదికేశవ సినిమా విడుదల కానుంది. అలాగే నితిన్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus