‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కోసం శ్రీలీల (Sreeleela) చేసిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మొదట్లో ఈ సాంగ్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ‘పుష్ప’ లో సమంత (Samantha) చేసిన ‘ఉ అంటావా’ సాంగ్ తో పోల్చి ఈ పాటని తక్కువగా మాట్లాడారు చాలామంది. అలాగే శ్రీలీలపై కూడా ట్రోలింగ్ జరిపారు. కానీ స్లో పాయిజన్ మాదిరి ‘కిస్సిక్’ సాంగ్ యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.
24 గంటల్లో ఈ సాంగ్ 27 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి.. నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. సినిమా రిలీజ్ తర్వాత.. ఈ సాంగ్ కి మరింత రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ లో ఐటెం సాంగ్ కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ని (Shraddha Kapoor) అనుకున్నారు. ఆమె అతి భారీగా రూ.8 కోట్లు పారితోషికం డిమాండ్ చేసింది.దీంతో సుకుమార్.. శ్రీలీలతో ఆ సాంగ్ చేయించేశాడు.
ఈ ఒక్క పాట కోసం శ్రీలీలకి కోటి నుండి రెండు కోట్లు పారితోషికం ఇచ్చినట్టు టాక్ నడిచింది. అయితే దీనిపై శ్రీలీల స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈరోజు జరిగిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) ఈవెంట్లో .. ”పుష్ప 2′ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మీరు రూ.2 కోట్లు పారితోషికం అందుకున్నారట నిజమేనా?’ అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. అందుకు శ్రీలీల.. ” ఆ సాంగ్ రెమ్యూనరేషన్ గురించి ఇంకా నిర్మాతలతో నాకు చర్చలు కూడా జరగలేదు.
ప్రస్తుతానికి నేను ఆ సాంగ్ కి గాను ఏమీ తీసుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. వెంటనే నిర్మాత నవీన్ ఎర్నేని (Naveen Yerneni) కూడా స్పందించి..’ ఆ సాంగ్ పారితోషికం విషయంలో ఇంకా మా మధ్య చర్చలు జరగలేదు. ఆమె కూడా నాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసింది లేదు. కానీ ఆమెతో డిస్కస్ చేసి ఆమె అడిగినంత ఇస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.