Rajamouli: రాజమౌళి శిష్యుడికి మరో గోల్డెన్ ఛాన్స్!

టాలీవుడ్‌లో మాస్టర్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) శిష్యుల నుంచి ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ హిట్లు రాలేదన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ ఈసారి అశ్విన్ గంగరాజు ఆలోచనలను మార్చేలా ముందుకు వస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ (Eega), బాహుబలి (Baahubali) వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అశ్విన్, 2021లో ఆకాశవాణి చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో అతను చూపించిన విభిన్న కథన శైలి, టెక్నికల్ ప్రావీణ్యం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

Rajamouli

ఇప్పుడు అశ్విన్ గంగరాజు తన రెండో ప్రయత్నంగా పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, ఇటీవల కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషభ్ శెట్టి (Rishab Shetty)  ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు సమాచారం. కాంతార ద్వారా రిషభ్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడంతో, ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

అశ్విన్ గంగరాజు, రిషభ్ శెట్టిల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పూర్తిగా వినూత్న కథాంశంతో, పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించేలా ఉండనుందట. అశ్విన్ రాజమౌళి (Rajamouli) స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ కావడంతో, ఈ చిత్రానికి గ్లోబల్ రీచ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అశ్విన్ కేవలం కథ చెప్పడమే కాదు, విజువల్‌గా కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ మూవీపై టాలీవుడ్‌లో ఇప్పటినుంచే హైప్ మొదలైంది.

సినీ పరిశ్రమలో విషాదం..దర్శకుడి కొడుకు కన్నుమూత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus