Sreeleela: ఆ వ్యాధి కారణంగా శ్రీలీల ఇంత ఇబ్బంది పడుతోందా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీ లీల పేరు చెబుతారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక త్వరలోనే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీలు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీ లీల కూడా ఒక వింత వ్యాధితో బాధపడుతున్నారట ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమా షూటింగ్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ విషయం స్వయంగా శ్రీ లీల ఒక సందర్భంలో తెలియచేయడం గమనార్హం. మరి శ్రీలీల ఎలాంటి వ్యాధితో బాధపడుతోంది ఏంటి అనే విషయానికి వస్తే…

శ్రీలీల (Sreeleela) వృత్తిపరంగా హీరోయిన్ అయినప్పటికీ ఈమె డాక్టర్ చదువు చదువుతున్న విషయం మనకు తెలిసిందే ఇలా డాక్టర్ కోర్సు పూర్తి చేస్తున్నటువంటి ఈమెకు ఈ వింత వ్యాధి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ వ్యాధికి ఎంతోమంది స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఇది మాత్రం తగ్గలేదట.. సాధారణంగా ఒకరికి ఒకటి లేదా రెండుసార్లు తుమ్ములు వస్తుంటాయి కానీ శ్రీలీలకు ఒకసారి తుమ్ము వచ్చింది అంటే దాదాపు పది 20 నిమిషాల పాటు అలాగే తుమ్ముతూనే ఉంటారట.

ఈ వ్యాధి కారణంగా ఈమె ఎంతో ఇబ్బంది పడుతున్నారని అయితే ట్రీట్మెంట్ కోసం ఎంతోమందిని సంప్రదించిన ఈ వ్యాధి మాత్రం తనకు తగ్గలేదని తెలుస్తోంది. ఇక షూటింగ్ లొకేషన్లో కూడా షూటింగ్ సమయంలో ఎక్కువగా దుమ్ముదులి ప్రాంతాలలో కూడా చేయాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఈమె ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus