Bigg Boss 5 Telugu: టాస్క్ లో రెచ్చిపోయిన హౌస్ మేట్స్ వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ ఫిజికల్ టాస్క్ కి హౌస్ మేట్స్ ఆడియన్స్ కి చుక్కలు చూపించారు. అసలు ఎవరు ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు. ఎవరు ఎలా టాస్క్ ఆడుతున్నారో కూడా అర్ధం కాకుండా తయరైంది పరిస్థితి. పంతం నీదా నాదా సై అనే టైటిల్ కి యాప్ట్ గా గేమ్ ఆడారు హౌస్ మేట్స్. ఇక ఇందులో సాగరా సోదరా అనే సబ్ టాస్క్ లో కాళ్లని సాగదీసేటపుడు శ్వేత చేయి కిందపెట్టిందని ఈగల్ టీమ్ రెచ్చిపోయింది. ఇరువైపు కౌంట్ అయిపోయిన తర్వాత మానస్ డన్ అని చెప్పడంతో శ్వేత అయిపోయింది కదా అని చేయి కిందపెట్టేసింది. కానీ, దీనికి అవతల టీమ్ ఒప్పుకోలేదు. మెజర్మెంట్ మాత్రమే తీస్కుని దానికి మాత్రమే డన్ అని చెప్పాను అని, అంతేకానీ మీరు గెలిచారని ఇంకా చెప్పలేదని శ్రీరామ్ అండ్ టీమ్ ఆర్గ్యూ చేసింది.

ఇక్కడ సంచాలకులు మరియు టీమ్ లీడర్స్ అయిన శ్రీరామ్ ఇంకా మానస్ లు ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీస్కోవాలి కాబట్టి రెండు టీమ్స్ కూడా నిజంగానే పంతం పట్టాయి. దీంతో ఇద్దరూ కలిసి నిర్ణయం తీస్కోలేకపోయారు. ఇక్కడే బిగ్ బాస్ టాస్క్ ని రద్దుచేశాడు. మానస్ పై ఉన్న కోపంతో శ్రీరామ్ చంద్ర ఈగల్స్ ఈగల్స్ అంటూ పాటపాడుతూ డ్యాన్స్ చేశాడు. దీంతో ఈగల్స్ టీమ్ మరింత రెచ్చిపోయింది. మానస్ టీమ్ లో ఉన్న రవి ఈగల్స్ టీమ్ దగ్గరకి వచ్చి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని మనం హౌస్ మేట్స్ అందరం ఫెయిల్ అయ్యాం అని చెప్పాడు. ఎండ్ హాప్ ద డే మనందరం హౌస్ మేట్స్ అని గుర్తుచేశాడు. సిగ్గు మీరు పడండి.. మేము గెలిచాం అంటూ శ్రీరామ్ అలాగే పక్కనున్న ప్రియ కౌంటర్స్ వేశారు.

తర్వాత మార్నిగ్ శ్రీరామ్ చంద్రకి మానస్ కి గట్టిగా పడింది. మానస్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే శ్రీరామ్ చంద్ర నీ ఏజ్ ఎంత… అంటూ అడిగి నేను నీకంటే పెద్దోడిని మెచ్యూరిటీ గురించి చెప్పకు అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో మానస్ కూడా కౌంటర్ వేశాడు. నాముందు నువ్వు పిల్లోడివి అని శ్రీరామ్ చంద్ర మానస్ కి గట్టిగానే ఇచ్చాడు. మానస్ కూడా నీ మెచ్యూరిటీ ఎంటో తెలుస్తుందిలే అంటూ కౌంటర్ వేశాడు. కేవలం టాస్క్ లోనే కాకుండా టాస్క్ అయిపోయాక కూడా హౌస్ మేట్స్ ఘర్షణ పడటం అనేది ఆసక్తికరంగా మారింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus