Sri Reddy: అలా చేసి ఉంటే మీ గౌరవం పెరిగేది… చిరంజీవి పై శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్!

  • August 8, 2023 / 06:30 PM IST

శ్రీ రెడ్డివివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ వివాదాస్పద నటిగా గుర్తింపు పొందినటువంటి ఈమె ఒకానొక సమయంలో తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు కాస్త దూరంగానే ఉన్నారని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు సినిమాల గురించి రాజకీయాల గురించి ఈమె స్పందిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి కీర్తి సురేష్ తో కాస్త చిలిపిగాప్రవర్తించారు తన చేతిని పట్టుకొని తన సినిమాలో చెల్లెలుగా నటించినప్పటికీ తనకు అలాంటి ఫీలింగ్ లేదని ఎందుకంటే తాను ముందు ముందు తనతో హీరోయిన్గా నటించాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేశారు.

అదేవిధంగా చిరంజీవి కీర్తి సురేష్ బుగ్గలను గిల్లడం తన ఇంటి ఫుడ్ తింటూ గ్లామర్ పెంచేసింది అంటూ మాట్లాడిన విషయాలపై శ్రీ రెడ్డి స్పందిస్తూ చిరంజీవిని ఏకిపారేశారు.ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ కూతురు వయసు ఉన్నటువంటి నటితో ఆ కామ వేషాలు ఏంటి? అంటూ ప్రశ్నించారు. లక్షల మంది చూస్తుండగా ఇలా వేదికపై ఒక హీరోయిన్ పట్ల ఇలా ప్రవర్తించడం ఏంటి చిరంజీవి గారు అంటూ మండిపడ్డారు.

ఇలా చేసే బదులు గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది కదా అంటూ ఈమె మండిపడ్డారు.ఇలా చిరంజీవి గురించి శ్రీరెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు శ్రీ రెడ్డి పై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీ రెడ్డికి మద్దతుగా నందమూరి అభిమానులు చేతులు కలుపుతూ చిరంజీవి గారు ఈ వేడుకలో కాస్త ఓవర్ చేశారని శ్రీ రెడ్డికి (Sri Reddy) మద్దతు తెలుపుతూ మరికొందరు చిరంజీవి వ్యవహారం పై కామెంట్ చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus