బిగ్ బాస్ హౌస్ లో దొంగ – పోలీస్ టాస్క్ పూర్తి అయ్యింది. అందులో ఎక్కువ బొమ్మలు కాపాడుకున్న పోలీసులు విజయం సాధించారు. అయితే, పోలీస్ గా ఉన్న శ్రీసత్య టాస్క్ గ్యాప్ లో రేవంత్ తో కాసేపు మాట్లాడింది. పక్కనే అర్జున్ కూడా ఉన్నాడు. అర్జున్ ఉన్నాడని చెప్పి, హౌస్ లో అందరూ నాకు అన్నయ్యలే అంటూ మొదలుపెట్టింది. దీనికి రేవంత్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు అన్నాడు. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు మాత్రం అన్నయ్యలే. యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది వాళ్లకే వదిలేస్తున్నా అని చెప్పింది.
అసలు శ్రీసత్య ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. గత వారం నాగార్జున వచ్చినపుడు అర్జున్ – శ్రీసత్యల మద్య ఏముంది అని ఆడియన్స్ ని అడిగాడు. దీనికి ఆడియన్స్ బాగా రియాక్ట్ అయ్యారు. ఇద్దరి మద్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని అనిపిస్తోందని ఆడియన్స్ చెప్పడంతో శ్రీసత్య ఫేస్ మారిపోయింది. అంతేకాదు, నాగార్జున హోస్ట్ చేస్తున్నారని అప్పుడు సైలంట్ గా ఉన్నా కూడా ఆ తర్వాత అర్జున్ ని పూర్తిగా ఎవైడ్ చేస్తూ వచ్చింది.
కానీ, అర్జున్ కళ్యాణ్ మాత్రం శ్రీసత్య చుట్టూనే తిరుగుతున్నాడు. టాస్క్ లో దొంగగా ఉన్నా కూడా శ్రీసత్య పక్కనే కూర్చున్నాడు. దీంతో శ్రీసత్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అన్నయ్యా అని నేను పిలుస్తాను, శ్రీహాన్ నన్ను చెల్లిగా యాక్సెప్ట్ చేశాడు. మీరు చేస్తారా చేయరా అన్నది మీ ఇష్టం అంటూ మాట్లాడింది. నేను ఏం చేసినా క్లియర్ గా ఉంటాను అని, నేను ఫన్ మాత్రమే చేస్తాను. అంటూ అర్జున్ పక్కనే కూర్చుని మాట్లాడింది.
టాస్క్ పూర్తి అయిన తర్వాత శ్రీహాన్ కూడా అర్జున్ ని ఉద్దేశ్యించి మాట్లాడాడు. అర్జున్ కి శ్రీసత్య అంటే ఫీలింగ్స్ ఉన్నాయని ఆమె ఏం చెప్పినా సూపర్, వాహ్ అంటూ మాట్లాడతాడు అని, కానీ శ్రీసత్య మాత్రం అన్నయ్యా అనేస్తోందని అన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏదో ఒక లవ్ స్టోరీకి తెరలేపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా తెరలేపారా అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వన్ సైడ్ లవ్ ఇప్పుడు హౌస్ లో నడుస్తోందని చెప్తున్నారు. మొత్తానికి అదీమేటర్.