Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎవరినడిగినా చాలా పాజిటివ్ గా చెబుతుంటారు. తోటి హీరోలు కూడా అతన్ని డార్లింగ్ అంటారు. స్టార్ డమ్ విషయంలో, ఫ్యాన్స్ విషయంలో అతిశయించే వ్యక్తి కాదు ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అంత పెద్ద స్టార్ అయినా, ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 23 ఏళ్ళు పూర్తి కావస్తున్నా… ప్రభాస్ అనర్గళంగా స్పీచ్ ఇవ్వలేడు. ఎవరితో అయినా సరే చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు.

Sridevi

జూనియర్ ఆర్టిస్టులను కూడా ‘బాగున్నావా’ అంటూ ఆత్మీయంగా పలకరిస్తారు ప్రభాస్ అని చాలా మంది చెబుతూ ఉంటారు. అలాంటి ప్రభాస్ గురించి తన మొదటి సినిమా హీరోయిన్ అయిన శ్రీదేవి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. శ్రీదేవి మాట్లాడుతూ..”ప్రభాస్‌గారితో ఏర్పడ్డ స్నేహం ఇప్పటికీ అలానే ఉంది. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. కానీ ఆయనలో ఎటువంటి గర్వం లేదు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.నాకైతే ఆయన చిన్నపిల్లాడిలా అనిపిస్తారు. అలాగే నవ్వుతూ మాట్లాడతారు.

ఆయన మాట్లాడే కొన్ని మాటలు అయితే అర్థం కూడా కావు (నవ్వుతూ). ‘ఈశ్వర్’ టైంలోనే ప్రభాస్ పెద్ద స్టార్ అవుతారని అంతా అనుకున్నారు. ఆ సినిమా విజయోత్సవ సభలకు వెళ్లిన ప్రతి చోటా జనాలు భారీగా తరలివచ్చేవారు. అది చూసి ఆయన మాస్ ఫాలోయింగ్ ఏంటనేది అర్ధమయ్యేది. కానీ మేము ఊహించిన దానికంటే కూడా ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యారు. ఈ విషయంలో ఆయన ఫస్ట్ హీరోయిన్ గా నేను ఆనందపడటం మాత్రమే కాకుండా గర్వపడతాను కూడా” అంటూ చెప్పుకొచ్చింది.

మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus