Srikanth, Ram Charan, Shankar: పాన్ ఇండియా సినిమాల్ శ్రీకాంత్ నెగిటివ్ రోల్!

  • October 3, 2021 / 07:41 AM IST

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ – బాలీవుడ్ నటి కియారా అద్వానీ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ మేకర్స్ సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన పోస్టర్ లో కూడా శ్రీకాంత్ ఉన్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు.

ఇక ‘ఇదే మా కథ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్, శంకర్-రామ్ చరణ్ చిత్రంలోని పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. తాను నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో శ్రీకాంత్ తన పాత్ర గురించి మరిన్ని వివరాలను ఆడిగినప్పటికి అంతకంటే ఎక్కువగా చెప్పలేను అని తెలియజేశారు. ఇక బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల అఖండ సినిమాలో కూడా శ్రీకాంత్ మరో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా దసరా ఫెస్టివల్ కు వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీకాంత్ మరికొన్ని సోలో సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందD సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆ సినిమా త్వరలోనే ఈ నెలలోనే విడుదల కానుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus