Srikanth: నాకు తెలిసినది సినిమా మాత్రమే!: శ్రీకాంత్

  • December 11, 2023 / 10:35 AM IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే శ్రీకాంత్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోగా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన ఇటీవల కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దేవర, గేమ్ చేంజర్ అనే సినిమాలో కూడా ఈయన నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా తెలియజేశారు. తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. తన నాన్న రైతు అని మేము కర్ణాటకలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళమని తెలిపారు. నేను డిగ్రీ పూర్తి చేసే వరకు కూడా నాన్న వ్యవసాయ పనులు చేశారని

నేను కూడా పొలం పనులకు వెళ్లి పొలం పనులు చేసే వాడిని నేను అన్ని పనులు చేస్తాను అంటూ శ్రీకాంత్ తెలియజేశారు. ఇక నటనపై ఆసక్తితో తాను ఇండస్ట్రీ వైపు వచ్చానని తన తమ్ముడు అమెరికా వెళ్లి స్థిరపడ్డారని తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు సినిమా తప్ప మరి ఏమి తెలియదని అందరి హీరోలు మాదిరిగా తాను ఇతర వ్యాపారాలలోకి కూడా వెళ్లలేదని,

నాకు తెలిసింది సినిమాలు మాత్రమేనని ఈ సందర్భంగా (Srikanth) శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా శ్రీకాంత్ రైతు బిడ్డ అనే విషయాన్ని వెల్లడించడంతో అందరూ షాక్ అవుతారు శ్రీకాంత్ ని చూస్తే ఆలా అసలు అనిపించరని ఈయన ఏదో ఉన్నత కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తారు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus