తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో శ్రీకాంత్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన టాలీవుడ్ హీరోల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన అల్లరి పని గురించి శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు చిన్నప్పుడు ఎన్టీఆర్ మా ఇంటి పక్కనే ఉండేవారు రోషన్ ఆడుకుంటూ ఉండగా మాకెవరికి తెలియకుండా ఎన్టీఆర్ రోషన్ ఎత్తుకెళ్లి వారి ఇంట్లో కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. మేము రోషన్ కనిపించలేదని చాలా కంగారుపడుతూ అంత వెతికాము ఆ సమయంలో చాలా కూల్ గా ఎన్టీఆర్ మా వద్దకు వచ్చి ఏంటి బాబాయ్ అలా వెతుకుతున్నావు రోషన్ నావద్దె ఉన్నారు అంటూ చల్లగా సమాధానం చెప్పారని ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ అని నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదని శ్రీకాంత్ తెలిపారు.
వెంకటేష్ మనం ఎప్పుడు చూసినా నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తారు అలా హ్యాపీగా కనిపించే వ్యక్తిని తాను చూడలేదు ఇక రామ్ చరణ్ గురించి కూడా శ్రీకాంత్ మాట్లాడుతూ సాఫ్ట్ గోయింగ్.. మెచ్యూర్డ్ పర్సన్ అని మెచ్చుకున్నారు. బాలకృష్ణ ఏదైనా స్ట్రెయిట్‌గా అనేస్తారని.. భోళాశంకరుడని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ శ్రీకాంత్ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాను చిరంజీవికి అభిమాని కాకుండా ఉంటే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చేవాడినే కాదు అంటూ శ్రీకాంత్ తెలిపారు.
ఒకానొక సమయంలో వరుసగా పెద్ద బ్యానర్లలో రిలీజైన 7 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చిరంజీవి తనని కూర్చోబెట్టుకుని ఎంతో ధైర్యం చెప్పి తిరిగి జీవితంపై నాకు ఆశలు కలిగేలా చేశారని నాకు చిరంజీవి గారు సొంత అన్నయ్యతో సమానం అంటూ ఈ సందర్భంగా చిరంజీవి గురించి అలాగే ఇతర సెలబ్రిటీల గురించి ఈ సందర్భంగా (Srikanth) శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!