Akhanda Movie: ‘అఖండ’.. మెయిన్ విలన్ అతడేనా..?

Advertisement

దర్శకుడు బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తుంటాడు. హీరోల్లో మాస్ యాంగిల్ ను బోయపాటి ప్రెజంట్ చేసినట్లుగా మరెవరూ చేయలేదు. హీరోలను మాత్రమే కాదు.. విలన్ పాత్రలను కూడా అంతే పవర్ ఫుల్ గా చూపిస్తుంటాడు. ‘లెజెండ్’ సినిమాలో జగపతిబాబుని విలన్ గా చూపించి ఆయన కెరీర్ ను మలుపు తిప్పారు బోయపాటి. ఇప్పుడు జగపతి నటుడిగా ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు.

పేరున్న నటులను విలన్ పాత్రల కోసం ఎంపిక చేసుకొని వాళ్ల పాత్రలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తుంటాడు. ఇప్పుడు శ్రీకాంత్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. బాలయ్య హీరోగా బోయపాటి ‘అఖండ’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది విలన్లు ఉన్నారు. శ్రీకాంత్ కు కూడా ఓ కీలకమైన పాత్ర దక్కింది. అయితే మెయిన్ విలన్ గా మరొకరిని తీసుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడు బోయపాటి విజన్ మారిందట.

శ్రీకాంత్ పాత్రను ఇంకాస్త డెవలప్ చేసి ఆ పాత్రనే మెయిన్ విలన్ గా చేసేశాడు బోయపాటి. హీరోగా శ్రీకాంత్ కి అవకాశాలు రావడం లేదు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ విలన్ గా సత్తా చూపితే గనుక ఆయనకి ఇండస్ట్రీలో అవకాశాలు పెరగడం ఖాయం. మరి ‘అఖండ’ శ్రీకాంత్ కి ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus