కథను మలుపు తిప్పే పాత్ర అంట!

తెలుగు సినిమాలో కుటుంబ కథా చిత్రం అన్నా, ప్రేమకథా చిత్రం అన్నా, వినోదభరిత చిత్రమన్నా బాగా గుర్తొచ్చే పేరు ‘పెళ్లిసందడి’. అంత చక్కగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇప్పుడు అదే పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తొలి సందడిలో శ్రీకాంత్‌ హీరో కాగా, రెండో సందడిలో అతని తనయుడు రోషన్‌ కథానాయకుడు. ఇదంతా పాత విషయమే. ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే… కొత్త ‘పెళ్లి సందడి’లో శ్రీకాంత్‌ కూడా నటిస్తున్నాడట.

అంతే కాదు అది కథను మలుపు తిప్పే పాత్ర అని కూడా చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అపురూప చిత్రం ‘పెళ్లిసందడి’. లిమిటెడ్‌ బడ్జెట్‌తో వచ్చినా, అన్‌లిమిటెడ్‌ వసూళ్లు సాధించిన చిత్రమిది. ఆ టైటిల్‌తో దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకురాలు గౌరి రోనక్‌ రూపొందించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు తుది దశకు వచ్చాయి. ఈ కథలో శ్రీకాంత్‌ కు కూడా ఓ పాత్ర సిద్ధం చేశారట. కనిపించేది కాసేపయినా కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

శ్రీకాంత్‌ పాత్రపై త్వరలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం చిత్రబృందం రోషన్‌కు హీరోయిన్‌ను వెతికే పనిలో ఉందదట. అన్నీ కుదిరితే వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక సినిమాకు కేవలం పేరు మాత్రమే తీసుకున్నారా? లేక నేపథ్యమూ అదేనా? లేక తొలి సినిమాకు కొనసాగింపా? ఆ సినిమాలో హీరో కొడుకుగా ఈ సినిమాలో హీరో కనిపిస్తాడా? లాంటి డౌట్స్‌ చాలా ఉన్నాయి. వీటికి త్వరలోనే సమాధానమొస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus