విలన్ గా ఫ్యామిలీ హీరో..?
- June 18, 2016 / 10:44 AM ISTByFilmy Focus
ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ త్వరలోనే విలన్ అవతారం ఎత్తనున్నడా..? శ్రీకాంత్ కూడా జగపతి బాబు బాటలోనే పయనించనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే శ్రీకాంత్ ఓ తమిళ చిత్రంలో విలన్ రోల్ పోషించనున్నాడని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగానే కాకుండా, చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. కాగా లెజెండ్ చిత్రంతో విలన్ అవతారం ఎత్తిన జగపతి బాబు ప్రస్తుతం 17 చిత్రాల్లో నటిస్తుండగా.. మరి శ్రీకాంత్ కూడా విలన్ గా బిజీ అవుతాడేమో వేచిచూడాలి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












