Srivalli Song: పుష్ప రికార్డుల మోత తగ్గట్లేదుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరపైకి వచ్చిన పుష్ప సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో పుష్ప ది రైజ్ టాప్ లిస్టులో చేరడం విశేషం.

అయితే ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ప్రేక్షకులకు కూడా ఎంతగానో నచ్చాయి. ఇక యూట్యూబ్ లో విడుదలైన పాటలకు కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతుండడం విశేషం. మొదటి నుంచి కూడా దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. మొదట పాటలు విడుదలైనప్పుడు కొంత నెగిటివ్ గా వచ్చింది. కానీ సినిమా విడుదల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పాటలకు కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ వస్తున్నాయి.

ఇక ఇటీవల విడుదలైన శ్రీవల్లి వీడియో సాంగ్ కూడా సోషల్ మీడియా లో అత్యధిక వేగంగా ట్రేడింగ్ లిస్టులో చేరిపోయింది. T సీరీస్ లో ఇప్పటివరకు ఎన్నో వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇక వాటి అన్నిటిలో అత్యధికంగా 100 మిలియన్ వ్యూవ్స్ అత్యధిక వేగంగా అందుకున్న పాటల్లో శ్రీవల్లి వీడియో సాంగ్ టాప్ లిస్ట్ లో చేరడం విశేషం. సినిమాలోని ప్రతి పాట కూడా ఇప్పటికే యూట్యూబ్లో ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక శ్రీవల్లీ సాంగ్ తో మరోసారి పుష్ప సినిమా పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగి పోతోంది.

ఇక హిందీ చిత్ర పరిశ్రమలో నే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా పుష్ప పాటలకు మంచి గుర్తింపు లభించింది. అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని అందర్నీ ఆశ్చర్యానికి కలిగించింది. మొత్తానికి పుష్ప సినిమా మొదటి భాగం ది రైజ్ సక్సెస్ కావడంతో రెండో భాగంపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో దర్శకుడు సుకుమార్ రెండవ భాగాన్ని అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus