వాజ్‌పేయికి సెల్యూట్ చేసిన ఎన్టీఆర్, రాజమౌళి
- August 17, 2018 / 07:27 AM ISTByFilmy Focus
బీజేపీ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి నిన్న (గురువారం) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ కూడా అతనిని గుర్తుచేసుకున్నారు.
రాజనీతిజ్ఞుడుకి సలాం
మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన గొప్ప నాయకుల్లో ఒకరైన వాజ్‌పేయికి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అసమాన రాజనీతిజ్ఞుడు, ధైర్యశాలి. ఆయన విజన్ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి. అటల్‌జీ మా గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. – ఎన్టీఆర్

శిరసు వంచి నమస్కరిస్తున్నా…
రాజకీయాలకు వన్నెతెచ్చిన అతికొద్దిమంది రాజనీతిజ్ఞుల్లో వాజ్‌పేయి ఒకరు. రహదారుల అనుసంధానం అనే ఆయన విజన్ దేశంలో బతుకుతున్న లక్షలాదిమంది జీవితాలను మార్చివేసింది. నా ప్రియమైన నాయకుడైన అటల్ బిహారి వాజ్‌పేయికు శిరసు వంచి నమస్కరిస్తున్నా. – ఎస్.ఎస్.రాజమౌళి

















