వైరల్ అవుతున్న రాజమౌళి ‘పెదరాయుడు’ పిక్..!

గత కొంత కాలంగా టాలీవుడ్ లో ‘వైట్ అండ్ వైట్’ సంస్కృతి ఊపందుకుంది. అదేనండి తెల్ల పంచెకట్టు.. సంస్కృతి అనమాట..! అప్పట్లో ‘పెదరాయుడు’ చిత్రంతో ఈ ట్రెండ్ మొదలయ్యింది. తరువాత కొన్నాళ్ళు ఇది అదృశ్యమయ్యింది. మళ్ళీ ఈ ట్రెండ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో అందరికీ గుర్తుచేశాడు. అందులో కనిపించింది కాసేపే.. అయినప్పటికీ.., ‘కాటమరాయుడు’ చిత్రంతో మరోసారి ఆ లోటును ఫుల్ ఫీల్ చేసాడు. ఇక ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో కింగ్ నాగార్జున, ‘దువ్వాడ జగన్నాథం – డీజె’ చిత్రంలో అల్లు అర్జున్ , ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ బాబు ఇక తాజాగా ‘వినయ విధేయ రామా’ చిత్రంలో రాంచరణ్ ఈ ‘వైట్ అండ్ వైట్’ పంచకట్టులో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇదిలా ఉండగా.. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ‘పెదరాయుడు’ గా కనిపించి హంగామా చేస్తున్నాడు.

ఇటీవల రాజమౌళి తన కొడుకు కార్తికేయ వివాహం ఫెయిర్ మౌంట్ (జైపూర్) భవంతిలో ఎంతో ఘనంగా జరిపించాడు. ఇక ఈ వేడుకలో రాజమౌళి – కీరవాణి కుటుంబాలతో పాటు పెళ్ళి కూతురు పూజా ప్రసాద్ తరపున జగపతిబాబు కుటుంబం కూడా బాగా సందడి చేసారు. ఇంకా ఈ సందర్బంగా తీసిన ఒక ఫోటోలో జక్కన్న పెదరాయుడు గెటప్ తో కనువునందు చేసాడు. వైట్ అండ్ వైట్ పంచెకట్టు.. నెరిసిన తల.. గడ్డం.. రెబాన్ కళ్లద్దాలతో రాజమౌళి దర్శనమివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ పిక్ పై సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతుండడం విశేషం. ఇక ప్రస్తుతం రాజమౌళి-రాంచరణ్-జూ.ఎన్టీఆర్ ల ‘ఆర్.ఆర్.ఆర్’ సెకండ్ షెడ్యూల్ జనవరి రెండు లేదా మూడు వారాలలో మొదలు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus