సినీ పరిశ్రమల్లో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ ఉంటే.. తొందరగా అవకాశాలు వస్తాయి. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవకాశాలు రావు అని కొందరు అంటుంటారు. అవకాశాలు అనే విషయంలో ఇది కరెక్టే. కానీ సక్సెస్ అవ్వడం, అవ్వకపోవడం అనేది బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేనిది. పెద్ద ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అయ్యి స్టార్లుగా ఎదగని వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి లిస్ట్ తీస్తే.. వివేక్ ఒబెరాయ్.. పేరు కూడా ఉంటుంది.
వివేక్ ఒబెరాయ్ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘కంపెనీ’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో కూడా ఇతన్ని అర్జీవినే పరిచయం చేశాడు. ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2 ‘ చిత్రాలతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు వివేక్. ఆ తర్వాత రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో విలన్ గా కూడా అలరించాడు.
అయితే ఇతని తండ్రి సురేష్ ఒబెరాయ్ బాలీవుడ్లో ఓ స్టార్ యాక్టర్. పెద్ద పొలిటీషియన్ కూడా. సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వివేక్ ఒబెరాయ్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇతను స్టార్ గా ఎదగలేదు. దానికి కారణాలు ఇటీవల చెప్పుకొచ్చాడు వివేక్ ఒబెరాయ్. ‘ అది ఓపెన్ సీక్రెట్. నేను సినీ పరిశ్రమలో ఎదగడం చాలా మందికి ఇష్టం లేదు. అందుకే చాలా కుట్రలు జరిగాయి. ఇక్కడ సినిమా హిట్ అవ్వడం.. ప్లాప్ అవ్వడం మేటర్ కాదు.
కానీ దాన్ని ఇక్కడి జనాలు మిగిలిన వాళ్లకి ఎలా చెబుతారు అనేది పెద్ద ప్రాబ్లమ్. నా విషయంలో ఇదే జరిగింది. ఆ శక్తులని నేను అడ్డుకోలేకపోయాను. పక్కవాళ్ళని తొక్కేయాలి అనే ఆలోచన ఉన్న వారి వలన ఇక్కడ చాలామంది నలిగిపోతున్నారు. ఇలాంటి అంటువ్యాధి ఉన్నవారితో జాగ్రత్తగా ఉండటం తప్ప ఇక చేసేదేమీ లేదు’ అంటూ వివేక్ ఒబెరాయ్ చెప్పుకొచ్చాడు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!