తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు తీయగల ఉత్తమ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అతని డైరక్షన్లో నటించాలని స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. అటువంటిది మాటల మాంత్రికుడు తన సినిమాలో పిలిచి పాత్ర ఇస్తానంటే ఓ నటుడు వద్దు పొమ్మన్నాడు. అతనెవరో తెలుసా.. విలన్ పాత్రల్లో మెప్పించిన సోనూ సూద్. ఈ బాలీవుడ్ నటుడికి అరుంధతి, దూకుడు వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి మూవీలోనూ సోనూ సూద్ బాగా నటించారు. అదే స్నేహంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో రూపొందించనున్న మూవీలో విలన్ గా నటించమని అడిగాడంట. వెంటనే సోను సూద్ నటించలేననని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోవడం త్రివిక్రమ్ వంతు అయింది.
ఇంతకీ ఈ అవకాశాన్ని సోనూసూద్ ఎందుకు వదులుకున్నారని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. సోనూసూద్ హీరోగా నటించాలని కలలు కంటున్నారని తెలిసింది. హిందీలోను పాజిటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. తెలుగులోనూ సెకండ్ హీరోగా చేశారు. ఇప్పుడు హీరోగా పరిచయం కావాలని ఆశపడుతున్నారు. తాజాగా సోనూ సూద్ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్న తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ “దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను” అంటూ మనసులోని మాటను బయట పెట్టి తెలుగు దర్శకులకు షాక్ ఇచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.