ఒకప్పటి నటి.. సన్యాసి లుక్ లో పెద్ద షాక్ ఇచ్చింది.!

‘సినిమాల్లో నటించే వాళ్ళ లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది అనేది అపోహ మాత్రమే’ అని చాలా మంది నటీనటుల జీవితాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. టాలెంట్ ఉన్నవాళ్ళకి టైం కలిసొచ్చి పెద్ద రేంజ్లో సక్సెస్ అయిన వారిని చూశాం. అలాగే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్..లుగా కూడా నిలబడలేకపోతున్న వారిని కూడా మనం చూశాం. ఈ లిస్ట్ లోకే వస్తుంది బర్ఖా మదన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె 1994లో మిస్ ఇండియా ఫైనలిస్టులో చోటు సంపాదించుకుంది.

సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్‌ వంటి వారితో పోటీపడి మరీ రన్నరప్ గా నిలిచింది. తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా కూడా నిలిచింది. 1996 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమా చేసింది. ఆ తర్వాత 2003 లో రామ్ గోపాల్ వర్మ ‘భూత్’ సినిమాలో కూడా ఈమె నటించడం జరిగింది. మరోపక్క సీరియల్స్‌ తో కూడా ప్రేక్షకులకి దగ్గరైంది. అయితే బర్ఖా అకస్మాత్తుగా సన్యాసినిగా మారి పెద్ద షాకిచ్చింది.

‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా పేరు మార్చుకుని పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతూ ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆధ్యాత్మిక అంశాలనే ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తోంది బర్ఖా మదన్. ఈమె లేటెస్ట్ లుక్ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అనే చెప్పాలి. ఇప్పుడు ధ్యానం, ప్రార్థనలు, ప్రజలకు సేవ.. ఇవే తన జీవితంగా భావిస్తోంది బర్భా.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus