Jr NTR: ఎన్టీఆర్ మూవీపై క్లారిటీ ఇచ్చిన మహేష్ హీరోయిన్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పై మళ్లీ వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ మినహా నటించే నటులకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలో వచ్చాయనే సంగతి తెలిసిందే.

అయితే అధికారికంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మరోవైపు ఈ సినిమాలో సోనాలి బింద్రే కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సోనాలి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరగగా తాజాగా సోనాలి బింద్రే ఈ వార్తల గురించి స్పందించి వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ న్యూస్ అని ఆమె కామెంట్లు చేశారు.

ఈ సినిమాకు సంబంధించి తనను ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదని ఆమె కామెంట్లు చేశారు. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఎన్టీఆర్, సోనాలి బింద్రే కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే. సోనాలి బింద్రే బాలకృష్ణతో పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో నటించారు.

అయితే పలనాటి బ్రహ్మనాయుడు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లో నటీనటుల గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus