అవకాశాలు లేవు.. కమిట్మెంట్ అడిగి నెల రోజులు ఏడిపించారు.. నటి కామెంట్స్ వైరల్!

అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న మల్లిక జాగుల అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎక్కువగా ఈమె విలన్ పాత్రలు చేసింది. చాలా కాలం తర్వాత తాజాగా ఈమె ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అందరికీ షాకిస్తున్నాయి అని చెప్పాలి. మల్లిక గాజుల మాట్లాడుతూ.. “నాకు సినిమాల్లో చాలా కాలం పాటు అవకాశాలు రాలేదు. అందువల్ల నేను డిప్రెషన్ కి లోనయ్యాను. అలాంటి టైంలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.

దీంతో హాస్పిటల్ కి తీసుకెళ్తే నేను బతకడం కష్టం అని చెప్పారు వైద్యులు.అయినప్పటికీ బతికి బయట పడ్డాను. సినీ ఇండస్ట్రీ అంటే కలర్ ఫుల్ లైఫ్ అని అంతా అనుకుంటారు. కానీ మహిళలకు ఇక్కడ ఉండేది ముళ్ళ జీవితం. కెరీర్ బాగుంటే ఓకే.. కానీ తేడా కొడితే మాత్రం కష్టం. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. దాని వల్ల చాలా మంది యువతులు బాధపడుతున్నారు. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే..! కరోనా తర్వాత నేను చాలా కష్టాలు పడ్డాను.

ఛాన్సులు లేవు.. అందుకని చీరలు అమ్మాను.. ఎక్కువ వ్యాంప్ రోల్స్ చేయడం వల్ల నన్ను చాలా చులకనగా.. తక్కువగా చూసేవారు. కొంతమంది కమిట్మెంట్ అడిగారు.. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. నెలరోజులపాటు టార్చర్ పెట్టారు. అవకాశాలు రాకుండా చేశారు. ‘నేను ఒళ్లు అమ్ముకోలేదు.. ఒళ్ళు చూపించను అంతే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus