విష్ణు ప్రియా(Vishnupriyaa Bhimeneni) పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇక వేణు స్వామి కూడా అందరికీ సుపరిచితమే.సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు. అతన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం ఎంకరేజ్ చేశారు. అతను చెప్పిన జాతకాలు ఏమీ నిజం కాలేదు. ఒక్కో ఛానల్ లో ఒక్కోటి చెప్పడం వల్ల.. నిజమైన కొన్ని అంశాలకి సంబంధించిన విజువల్స్ తీసుకుని ఇతన్ని హైలెట్ చేశారు నెటిజెన్లు.
కానీ అదే టైంలో ఇతను ప్రభాస్, పవన్ కళ్యాణ్ అభిమానులకు నెగిటివ్ అయిపోయాడు. అప్పటి నుండి ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇతన్ని సోషల్ మీడియాలో నెటిజెన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వేణు స్వామి గురించి విష్ణు ప్రియా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
విష్ణు ప్రియా మాట్లాడుతూ.. “వేణు స్వామి గురించి బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా తల్లి విషయంలో ఆయన చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తల్లి అనారోగ్యం పాలైనప్పుడు ట్రీట్మెంట్ నిమిత్తం లక్షల్లో బిల్లులు అయ్యాయి. కానీ ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు. చాలా ప్రయత్నించాను.
చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వేణు స్వామిని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఆయన వెంటనే ఆ బిల్లులు పే చేయడానికి లక్షలు అరేంజ్ చేసి సాయం చేశారు. అందువల్ల 3 రోజులే బ్రతుకుతుంది అనుకున్న నా తల్లి మరో ఏడాది పాటు బ్రతికింది.ఆయన అంత మంచివారు అని అప్పటికి నేను కూడా అనుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.