ఎల్జీబీటీ కమ్యూనిటీపై నటి అభిప్రాయం!

  • June 16, 2021 / 04:59 PM IST

హీరోయిన్లకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది హీరోయిన్లను తెగ ఆరాధిస్తుంటారు. వాళ్లతో సెల్ఫీ దిగాలని, ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ నెటిజన్ కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తో ప్రేమలో పడ్డాడు. అయితే ఆమెని పెళ్లికి ఎలా ఒప్పించాలో నేరుగా ఆమెనే అడిగేశాడు. తాజాగా తన అభిమానులతో ముచ్చటించిన ప్రియా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలని” అడిగితే..

దానికి ఆమె.. తనతో రిలేషన్షిప్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందని.. కాబట్టి తనను ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియకపోవడమే మంచిదని చెప్పుకొచ్చింది. మరో నెటిజన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పై మీకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించాడు. దానికి బదులిస్తూ.. అలాంటి వాటిపై నమ్మకం లేదని కానీ తను మొదటిచూపులోనే ప్రేమలో పడినట్లు చెప్పింది. మరో నెటిజన్ ఎల్జీబీటీ కమ్యూనిటీపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘మీరు సంతోషంగా ఉన్నంత కాలం మీరు ఎవరితో ప్రేమలో పడ్డారనేది మ్యాటర్ కాదంటూ’ చెప్పుకొచ్చింది.

తమిళంలో పని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రియా చివరిగా ‘మాఫియా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus