Actress: టాలీవుడ్ లో సినిమాతో పరిచయమై బాలీవుడ్ ని ఏలుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటో లో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?, ఈమె ముందుగా మన తెలుగు సినిమా ద్వారానే మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలా వచ్చిన పాపులారిటీ తో బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంది. అనతి కాలం లోనే బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , అమీర్ ఖాన్ , హ్రితిక్ రోషన్ ఇలా బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది.

ఈమెకి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు, ఆమె పేరు వింటేనే పిచ్చెక్కిపోతారు, రీసెంట్ గానే ఒక యంగ్ హీరోని ప్రేమించి పెళ్ళాడి సంతోషం గా దాంపత్య జీవితం గడుపుతుంది. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత కూడా గుర్తు పట్టలేకపోతున్నారా..?, ఆమె మరెవరో కాదు కత్రినా కైఫ్. ఇప్పుడే కాదు , చిన్నతనం లో కూడా ఆమె ఎంతో క్యూట్ గా ఉంది. ఈమె తెలుగు లో వెంకటేష్ తో ‘మల్లీశ్వరి’, అలాగే బాలయ్య బాబు తో ‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాల్లో (Actress) హీరోయిన్ గా నటించింది.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో బాగా బిజీ అవ్వడం తో తెలుగు సినిమాల వైపు మళ్ళీ ఈమె చూడలేదు. ఈమె తన మొదటి తెలుగు సినిమా ‘మల్లీశ్వరి’ కి ఆరోజుల్లోనే కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుందట. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్ న్యూస్ గా నిల్చింది. ఇక రీసెంట్ గానే ఈమె విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడింది. అంతకు ముందు ఆమె సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి వారితో ప్రేమాయణం నడిపినట్టు ఒక రేంజ్ లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వాళ్ళిద్దరితో డేటింగ్ చేసిన విషయం వాస్తవమే, కానీ చివరికి విక్కీ కౌశల్ ని పెళ్లాడింది. ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్ టైగర్ 3 చిత్రం లో నటిస్తుంది, ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల అవ్వ్వబోతున్న ఈ సినిమా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus