Easwari Rao: మహేష్ కి అత్తగా ఆమెను అనుకుంటే.. ఈమెతో చేయించారట.. ఈవిడే బెటర్..!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా ‘గుంటూరు కారం’ వచ్చింది. జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా మొదటి వారం సంక్రాంతి సెలవుల అడ్వాంటేజ్ తో సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. మొత్తంగా షేర్ రూ.110 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ పండితుల సమాచారం.

నెగిటివ్ టాక్ వచ్చిన ఓ సినిమా రూ.131 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో.. రూ.110 కోట్ల వరకు రీచ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా ‘గుంటూరు కారం’ తో మహేష్ బాబు ఓ ట్రెండ్ సెట్ చేసినట్టే అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘గుంటూరు కారం’ సినిమాకి ఫ్యాన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. దానిని మిగతా హీరోల ఫ్యాన్స్ డిజాస్టర్ టాక్ గా స్ప్రెడ్ చేయడం జరిగింది.

అయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మందికి ఈ సినిమా నచ్చింది. ప్రమోషన్ కరెక్ట్ గా చేసుకుంటే ఈ సినిమా ఫలితం కచ్చితంగా ఇంకా బెటర్ గా ఉండేది అనేది వాస్తవం. ‘గుంటూరు కారం’ లో మహేష్ నటన బాగుంటుంది. అతని తర్వాత ఆ రేంజ్లో పెర్ఫార్మ్ చేసింది ఎవరు అంటే కచ్చితంగా ఈశ్వరి రావు (Easwari Rao) అనే చెప్పాలి. ఈమె మహేష్ కి అత్త పాత్రలో చాలా చక్కగా నటించింది.

అయితే ఈ పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్ టాలీవుడ్ యాంకర్ అనసూయని అనుకున్నాడట. కానీ ఈ సినిమాలో ఈశ్వరి రావు మీనాక్షి చౌదరికి తల్లిగా కూడా కనిపిస్తుంది. ఓ హీరోయిన్ కి తల్లిగా చేయడం అంటే అనసూయ ఒప్పుకుంటుందో లేదో అనే కన్ఫ్యూజన్ తో త్రివిక్రమ్ అండ్ టీం ఈశ్వరి రావుని ఫైనల్ చేశారట. గతంలో ఈశ్వరి రావు గారు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాలో కూడా నటించడం జరిగింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus