కరోనా మహమ్మారి ఇప్పుడు రూపం మార్చుకుని మరీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీని భారిన పడినవాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారవుతుంది. రోజు రోజుకూ కరోనా మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా దీని భారిన పడి మరణిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం.ఈ మధ్యకాలంలో వరుసగా సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా మరో నటి కూడా కరోనాకు బలైపోయినట్టు తెలుస్తుంది. ఈమె వయసు 40 ఏళ్ళు మాత్రమే కావడం.. మరింత బాధపెట్టే విషయం.
వివరాల్లోకి వెళితే.. ‘గుడ్ న్యూస్’ ‘చిచోరే’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన నటి అభిలాష పాటిల్ ఇటీవల కరోనాకి గురవ్వడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారట ఆమె కుటుంబసభ్యులు. అయితే ఈమె పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలుస్తుంది.అభిలాష భర్త ,కొడుకు కి అప్పటివరకూ ఆమె ధైర్యం చెప్పి ఓదార్చిందట. అలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదని అక్కడి వారు చెప్పుకొస్తున్నారు. ఇటీవల అభిలాష షూటింగ్ నిమిత్తం బెనారస్కు వెళ్ళగా అక్కడే ఈమె కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆమెను ముంబై హాస్పిటల్ లో జాయిన్ చేశారట. అయినా ఉపయోగం లేకుండా పోయింది..!మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’ తో ఈమె పాపులర్ అయ్యింది.ఈమె మరణించింది అనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు ఈమె మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.