‘మీటూ’ ఉద్యమం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం సౌత్ కు వరకూ వచ్చి సంచలనం సృష్టించింది. ‘పలానా నటుడో లేక దర్శకుడో లేక నిర్మాతో నన్ను వేధించాడని’ కొందరు నటీమణులు మీడియా ముందుకో లేక సోషల్ మీడియా ముఖంగా వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని వలన మాకు అవకాశాలు లేకుండా చేసారని కూడా ఆ నటీమణులు తమ ఆవేదనని వ్యక్తం చేసారు. అంతే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరో హీరోయిన్ తనకు జరిగిన ఆవేదనని బయటపెట్టడం సంచలనం సృష్టించింది.
మలయాళీ నటి గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పైన సంచనల వ్యాఖ్యలు చేసింది. “సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తల్లో నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కొందరు రాత్రికి వస్తావా అంటూ అసభ్యంగా మెసేజ్ లు పంపేవారు. నాకు అలాంటి మెసేజ్ లు పంపేవాళ్ళకి నో చెప్పేదానిని. దాంతో ఫోన్లు కూడా చేసేవారు. కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో పైకి రావాలని పట్టుదల పెంచుకున్నాను. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి ఈ వేధింపులు మరీ ఎక్కువగా వుంటాయి. ఇండస్ట్రీకి చెందినవారికి ఇలాంటి చేదు అనుభవాలు తక్కువగా ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చింది.