సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. కొన్నాళ్ల నుండి.. ప్రతీరోజూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, స్టార్ నటుడు నాజర్ తండ్రి,మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి, ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్, శృంగార నటి బాబిలోనా సోదరుడు విక్కీ,హాలీవుడ్ నటుడు, అమెరికాకు చెందిన కమెడియన్ మాథ్యూ పెర్రీ,నటి డా.ప్రియ దర్శకుడు అర్పుదాన్ వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటి కూడా కన్నుమూసినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి, మోడల్ అయిన లువానా ఆండ్రేడ్ కన్నుమూసింది. ఆమె వయసు 29 ఏళ్లు మాత్రమే కావడం బాధాకరం. ఆమె ఓ బ్రెజిలియన్ ఇన్ఫ్లుయెన్సర్.ఆమెకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె మొన్నామధ్య లైపోసక్షన్ (కొవ్వును తొలగించే ప్రక్రియ కలిగిన) సర్జరీ చేయించుకోవడం జరిగింది.
ఆ తర్వాత ఆమెకు ఏకంగా 4సార్లు గుండెపోటు వచ్చిందట. మరోపక్క (Actress) ఆమె శరీరంలో రక్తం కూడా గడ్డ కట్టిందని (థ్రోంబోసిస్) అని తెలుస్తుంది. దీంతో ఐసీయూలో చేరి చికిత్స పొందినా .. లాభం లేకపోయింది అని సమాచారం. చిన్న వయసులోనే ఆమె మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టే విషయం. ఇలాంటి సర్జరీలు ఎంత ప్రమాదకరమో… లువానా ఆండ్రేడ్ మరణంతో అందరికీ తెలిసొచ్చింది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!