Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ చిత్రం జూలై 25న రిలీజ్ అయ్యింది. అయితే ‘హరిహర వీరమల్లు’ వంటి పెద్ద సినిమా తెలుగులో రిలీజ్ అవుతుండటంతో తెలుగులో ఆ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు. అయితే వారం తర్వాత అంటే ఆగస్టు 1న అదే చిత్రాన్ని ‘సార్ మేడమ్’ గా రిలీజ్ చేశారు. తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.

Sir Madam Collections

దీంతో ‘సార్ మేడమ్’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి పడింది. పైగా విజయ్ సేతుపతి ‘మహారాజ’ తో ఫామ్లోకి వచ్చాడు. పైగా తమిళంలో ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంది. దీంతో తెలుగులో కూడా కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అని అంతా భావిస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.16 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర(టోటల్) 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.35 cr(షేర్)
.
‘సార్ మేడమ్'(తెలుగు వెర్షన్ ఆఫ్ తలైవన్ తలైవి) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ‘హరిహర వీరమల్లు’ ‘కింగ్డమ్’ ‘మహావతార్ నరసింహ’ వంటి సినిమాల కారణంగా ‘సార్ మేడమ్’ కి తెలుగులో ఎక్కువ థియేటర్స్ అయితే లభించలేదు. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.35 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. గ్రాస్ పరంగా రూ.0.56 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.1.45 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది

‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus