Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

కొంతమంది నటుల్ని తొలి చూసినప్పుడే ‘వీడు మామూలోడు కాదు’ అనిపిస్తుంది. దానికి కారణం వారిలో కనిపించే పెక్యూలియర్‌నెస్‌. అది సినిమాలోనే కాదు, బయట ప్రెస్‌మీట్‌లు, ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో కూడా. అలాంటి ఇంప్రెషెన్‌ ఇటీవల అందుకున్న నటుడు వెంకిటేశ్‌. మలయాళ సినిమా పరిశ్రమ నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘కింగ్డమ్‌’ సినిమాలో మురుగన్‌గా విలనీ భలే పండించాడు. బయట చూడటానికి చాలా క్లాస్‌గా ఉన్నాడు కానీ.. కుర్రోడు వీర మాస్‌. సినిమాలో అది మనం చూడొచ్చు. అంతేకాదు బయట బ్యాగ్రౌండ్‌ కూడా అదిరిపోతుంది.

Kingdom Venkitesh

ఇక్కడ అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ అంటే.. ఏదో నెపో కిడ్‌ అనో, లేక భారీ భవనాలు ఉన్న మిలియనీర్‌ అని కాదు. ఆయన సినిమాల్లోకి రావడానికి పడిన కష్టం, అంతకుముందు జీవితాన్ని ముందుకు నడపడానికి పడిన శ్రమ, ఆయన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు. ఆయన కథ మంచి మాస్‌ కమర్షియల్‌ సినిమా అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే వెంకిటేష్‌ ఎప్పుడు, ఎక్కడ ఆడిషన్ జరిగినా వెళ్లాడు. తన ట్యాలెంట్ చూపించాడు. చిన్న రోల్స్ అనే ఫీలింగ్‌ లేకుండా నటించాడు కూడా. అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు.

ఈ క్రమంలో సీరియళ్లు, టీవీ షోలు, సినిమాలు ఇలా అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నాడు.. అదరగొట్టి చూపించాడు. ఇప్పుడు ‘కింగ్డమ్‌’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో బ్యాగ్రౌండ్‌ ఏంటా అని చూస్తే.. కేరళకు చెందిన వెంకిటేశ్ ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అంతకు ముందు బతుకుదెరువు కోసం త్రివేండ్రంలో రోడ్డు సైడు ఓ ఇడ్లీ స్టాల్ నిర్వహించాడు. ఆ కొట్టు ఇడ్లీలకు బాగా ఫేమస్. ఆ షాపులో చాలా వెరైటీల ఇడ్లీలు దొరుకుతాయట.

ఆ షాపు దగ్గర ‘సుడా సుడా ఇడ్లీ’ (వేడి వేడి ఇడ్లీ) అంటూ వెంకిటేష్ చేసిన ఒక రీల్‌తో ఆ ఇడ్లీ బండి బాగా ఫేమస్ అయింది, ఆ తర్వాత వెంకిటేశ్‌ కూడా ఫేమస్‌ అయ్యాడు. ఇప్పుడు సినిమాలకు చిన్న గ్యాప్‌ వస్తే.. తన ఇడ్లీ కొట్టుకు వెళతాడట. సినిమా షూటింగ్స్ లేని సమయంలో స్టాల్‌లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తుండాట. అయితే ఇప్పుడు వెళ్లడం తగ్గిందట.

చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus