ఈ వెడ్డింగ్ సీజన్లో స్మాల్ అండ్ సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.. తమ మనసుకి నచ్చిన వారితో ఏడడుగులేస్తూ.. కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నారు.. ఇప్పటికే హన్సిక, నాగ శౌర్య, కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా వంటి పలువురు స్టార్స్ ఓ ఇంటివారైపోయారు.. శర్వానంద్ లాంటి వారు మరికొందరు నిశ్చితార్థాలు చేసేసుకుని పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు.. పనిలో పనిగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత వంటి స్మాల్ స్క్రీన్ సెలబ్స్ కూడా శుభకార్యంతో ఒక్కటైపోయారు..
ఇక బాలీవుడ్ విషయానికొస్తే.. ఆలియా భట్ – రణ్ బీర్ కపూర్, కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్.. ఇలాంటి ప్రేమపక్షులంతా మ్యారేజెస్ చేసేసుకుని చక్కగా సెటిలైపోయారు.. హీరోల సంగతి పక్కన పెడితే.. మూడు పదులు దాటుతున్నా ఇంకా వెడ్డింగ్ ఊసే ఎత్తని ముద్దుగుమ్మలు కొందరున్నారు.. వారిలో ప్రియాంక చోప్రా కజిన్ పరిణితి చోప్రా కూడా ఉంది.. 34 ఏళ్ల పరిణితి (ఈ ఏడాది అక్టోబర్ 22కి 35 వస్తాయి).. పెళ్లి కావాలని తొందర పడుతోంది.. బాలీవుడ్లో జరుగుతున్న వరుస పెళ్లిళ్లు చూసి తనకు కూడా కోరిక కలిగినట్టుంది మరి..
‘పెళ్లెప్పుడవుతుంది బాబూ.. నాకు మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబూ’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో పాడుకున్నట్టే.. రివర్స్‌లో హీరోయిన్ పాడుకుంటుంది.. పెళ్లి చేసుకోవాలనుంది.. మంచి పిల్లాడు ఉంటే చూడండి అంటోంది.. అంతేనా.. ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?’ అంటూ కుర్రకారుని ప్రశ్నిస్తోంది.. ఇంతకీ అమ్మడు తన పెళ్లి గురించి ఏం చెప్పిందంటే..
‘‘నేనింకా సింగిల్‌గానే ఉన్నా.. త్వరలోనే మింగిల్ కావాలని ఉంది.. ప్రస్తుతం ఏ రిలేషన్లో లేను.. గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధం.. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?.. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి’’ అంటూ ఫ్యాన్స్‌తో చెప్పుకొచ్చింది..