ట్రోలింగ్‌పై స్పందించిన నాటి బాలీవుడ్ హాట్‌ బ్యూటీ!

సినిమా వాళ్లకు గాసిప్స్‌, ట్రోల్స్ నిత్యకృత్యం అయిపోయాయి. హీరోల విషయంలో ఇవి కాస్త తక్కువవ్వొచ్చేమో కానీ, హీరోయిన్ల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ప్రస్తుత డిజిటల్‌ మీడియా టైమ్‌లో ఇవి బాగా ఎక్కువయ్యాయి. అలా అని గతంలో లేవా అంటే చాలానే ఉన్నాయి అంటున్నారు నాటి కథానాయికలు. 90వ దశకంలో సినిమా హీరోయిన్ల పరిస్థితి, అప్పుడు మీడియా పరిస్థితిని ఉదాహరణతో వివరించింది ప్రముఖ నటి రవీనా టాండన్‌. గతంలో తన విషయంలో జరిగిన ఇబ్బందికరమైన విషయం చెప్పింది.

సినిమాలు – గాసిప్‌లకు విడదీయరాని బంధం ఉంది. గాసిప్‌ల్లో అన్నీ నిజమవ్వాలని లేదు. అలా అని చెప్పి గాసిప్‌లన్నీ అబద్దమవ్వాలనీ లేదు. అయితే ఒక ఫొటోను పట్టుకొని ఏది పడితే అది రాసేయడం మాత్రం ఇబ్బందికరమనే చెప్పాలి. అలా ఓసారి రవీనా టాండన్‌ లైఫ్‌లో జరిగింది. 90ల కాలంలో సినిమా సంచికలు విడుదలయ్యాయంటే భయంతో వణికిపోయేవారట నటి రవీనా టాండన్‌. ఆ రోజుల్లో తనపై విపరీతమైన గాసిప్స్‌ పుట్టుకొచ్చేవని.. వాటిని చూస్తే భయమేసేదని ఆమె చెప్పారు.

ఆ రోజుల్లో సినిమా విలేకరులు తమపై దారుణంగా వార్తలు రాసేవారని గతాన్ని గుర్తు చేసుకున్నారు రవీనా టాండన్‌. ఒకానొక సమయంలో తన సోదరుడినే బాయ్‌ఫ్రెండ్‌గా మార్చేసి.. వార్తలు రాశారని రవీనా బాధపడ్డారు. ఈ గాసిప్స్‌ వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను, ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పింది రవీనా. గాసిప్స్‌ను ఎక్కువగా ప్రచురించే మ్యాగజైన్లు కొన్ని.. నా పేరును, విలువను నాశనం చేసేశాయి. ఆ రోజుల్లో నేను, నా కుటుంబం చాలా రోజులు ఇబ్బందులు పడ్డాం అని చెప్పింది రవీనా.

ఆ గాసిప్స్‌ పత్రికల్లో ఒకటి నా సోదరుడిని ఏకంగా నా బాయ్‌ఫ్రెండ్‌ అని రాసుకొచ్చింది. ‘‘ఓ కుర్రాడు రవీనా టాండన్‌ను సినిమా షూటింగ్‌కి డ్రాప్‌ చేయడానికి వస్తున్నాడు. ఆయన రవీనా బాయ్‌ఫ్రెండ్‌ అట’’ అంటూ ఓ గాసిప్స్‌ మ్యాగజైన్‌లో రాసుకొచ్చారు. ఆ విషయంపై ఎవరు స్పష్టత ఇవ్వాలి? ఎంత అని చెప్పాలి? అంటూ తన బాధను వ్యక్తం చేసింది. మరిప్పటి కథానాయికలు ఏమంటారో చూడాలి

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus