నరకం నుండి బయటపడ్డాను.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ వీడియో వైరల్..!

Advertisement

బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ అందరికీ సుపరిచితమే. తెలుగు వారికి ఈమె ఆశా సైనీ గా సుపరిచితమే. ‘ప్రేమ కోసం’ ‘అంతా మనమంచికే’ ‘నవ్వుతూ బతకాలిరా’ ‘నరసింహనాయుడు’ ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. అయితే ‘మీటూ’ ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ నిర్మాత ఈమెపై తీవ్రమైన లైంగిక దాడి చేసి వేధించాడని ఈమె తెలియజేసిన సంగతి తెలిసిందే. 14 నెలల పాటు నరకం అనుభవించానని ఈమె తెలియజేసింది.

దీన్ని గుర్తు చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇందులో జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. కానీ నా పరిస్థితి అంతలోనే పూర్తిగా మారిపోయింది. అతను నన్ను ప్రతిసారి దుర్భాషలాడేవాడు. నా ముఖం పై,నా ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా కొట్టేవాడు. అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేసేవాడు.

చివరికి అతని నుండి తప్పించుకుని పారిపోయి వచ్చాను’.ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాను. ఆ నరకం నుండి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది.” అంటూ ఈమె వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. కానీ ఆ నిర్మాత ఎవరు అన్న విషయాన్ని బయటపెట్టలేదు. 2016 నుండి ఈమె ‘మెయిడ్ ఇన్ ఇండియా’, ‘గాంఢీ బాత్’, ‘మాయ నగరి : సిటీ ఆఫ్ డ్రీమ్స్’, ‘ఆర్య’ వంటి వెబ్ సిరీస్లలో నటిస్తూ వచ్చింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read