కన్నతల్లి ముందే అలా చేశాడు.. ‘సేక్రెడ్ గేమ్స్’ నటి కామెంట్స్!

సెలబ్రిటీల జీవితాల్లో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వెండితెరపై మేకప్ వేసుకొని నవ్వుతూ కనిపిస్తూ.. వారి విషాదాన్ని తమలోనే దాచుకుంటారు. నటి కుబ్ర సైత్ కూడా ఎన్నో ఏళ్లుగా భరిస్తున్న బాధను ఎత్తలేఖకు బయటపెట్టి కొంత భారాన్ని తగ్గించుకుంది. ఓపెన్ గా బయటకు చెప్పకపోయినా.. తను రాసిన ఓపెన్ బుక్: నాట్ క్వైట్‌ ఎ మెమోయిర్‌ అనే పుస్తకంలో ఎంతోకాలంగా అనుభవిస్తున్న వేదనను బయటపెట్టింది. ”అప్పుడు నాకు పదిహేడేళ్లు.

మా ఫ్యామిలీ మొత్తం కలిసి బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ కి తరచూ వెళ్తుండేవాళ్లం. అలా ఆ రెస్టారెంట్ యజమాని మా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. మా అమ్మకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేవాళ్లు. ఆ తరువాతే అతడిలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు. కారులో కూర్చున్నప్పుడు నా తొడ మీద చేయి విసి నిమురుతూ.. అసభ్యంగా తాకుతూ వేధించేవాడు. నేను అంకుల్ అని పిలిస్తే.. అలా పిలవొద్దని వారించాడు. మెల్లగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు.

అమ్మ అతడికి వంట చేసి పెట్టేది. నవ్వుతూ మాట్లాడేది. ఆమె ముందే అతడు నాకు ముద్దులు పెడుతూ నువ్ అంటే నాకెంతో ఇష్టమని కబుర్లు చెప్పేవాడు. నాకు అసౌకర్యంగా అనిపించినా.. ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోయేదాన్ని. ఓసారి నన్ను హోటల్ కి తీసుకెళ్లి పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాక్ అయ్యాను. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ క్షణమే గట్టిగా అరవాల్సింది, సాయం కోసం పరిగెత్తాల్సింది.

కానీ షాక్ లో ఉండిపోవడంతో నా నోటి నుంచి చిన్న మాట కూడా రాలేదు. అతడు అలానే ముద్దులు పెడుతూ.. తనకు నచ్చింది చేసుకుంటూ పోయాడు. నా వర్జినిటీ కోల్పోయాను. ఇదే నా జీవితంలో అత్యంత సిగ్గుచేటు రహస్యం. రెండున్నరేళ్ల పాటు అతడు లైంగికంగా వేధించాడు అతడు డబ్బు పంపించడం మానేసినప్పుడు.. అతడితో ఎందుకు గొడవపడుతున్నావని అమ్మ నన్నే తిట్టేది” అంటూ తన బాధను చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ నెట్ ఫ్లిక్స్ లో ‘సేక్రెడ్ గేమ్స్’లో నటించింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus