బాలీవుడ్ లో నటిగా సినిమాలు చేసిన సోమి.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఎనిమిదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇదివరకు ఈ విషయం గురించి మాట్లాడింది సోమి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. ఇందులో తన గతాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. అంతేకాదు.. ఈ విషయం గురించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తరచూ ఎందుకు మాట్లాడుతుందో కూడా వివరించింది. రీసెంట్ గా సల్మాన్ ను దూషిస్తూ.. ఒక పోస్ట్ ను షేర్ చేసిన సోమి దాన్ని వెంటనే తొలగించింది.
అదే సమయంలో తనకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఒక స్టోరీ చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్‌తో మీరు అనుభవించిన హింస గురించి ఓపెన్‌గా చెప్పేందుకు మీకు ఇంత సమయం పట్టిందేమిటి?’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన నోట్‌లో అసలు కారణాన్ని చెప్పుకొచ్చింది. 1990లలో బ్లాయిడ్స్‌లో తన కథ మొత్తం వార్తల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడది బ్రేకింగ్ న్యూస్ కాదని చెప్పింది. 1990ల ప్రారంభం నుంచి 1999 వరకు ఏదైనా టాబ్లాయిడ్ లేదా ఫిల్మ్ మ్యాగజైన్‌ను తిరిగేస్తే సోమీని సల్మాన్ శారీరకంగా వేధింపులకు గురిచేసిన స్టోరీలు చాలానే కనిపిస్తాయని..
కానీ అందరూ ఈ విషయం గురించి ఇప్పుడు చెబుతున్నట్లు ప్రశ్నిస్తున్నారని చెప్పింది. చిన్నప్పుడే వేధింపులు ఎదుర్కొన్న వ్యక్తిగా ఈ విషయం గురించి మాట్లాడడం మానేశానని.. కానీ ఇప్పుడు చెబుతున్నందుకు ఒక కారణం ఉందని తెలిపింది. సోమి 16 ఏళ్ల వయసులో సల్మాన్ మీద ఉన్న ఇష్టంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. సల్మాన్ తో కలిసి సినిమాలు చేయడంతో పాటు అతడితో రిలేషన్ పెట్టుకుంది.
సల్మాన్ తనను మోసం చేయడంతో బ్రేకప్ అయినట్లు ఇదివరకు సోమి వెల్లడించింది. సల్మాన్ తల్లితో కూడా తనకు మంచి అనుబంధం ఉందని తెలిపింది. ఇక లేటెస్ట్ గా షేర్ చేసిన పోస్ట్ లో సల్మాన్ తో గడిపిన ఎనిమిది సంవత్సరాలు తన మొత్తం జీవితంలో అత్యంత చెత్తదిగా పేర్కొంది. అంతేకాదు.. సల్మాన్ తనను తక్కువ చేసి మాట్లాడేవాడిని చెప్పుకొచ్చింది.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!