దర్శకధీరుడు రాజమౌళి ఏళ్ల తరబడి ఊహించడానికే కష్టం అనుకున్న తెలుగు సినిమాకి, ఇండియాలోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టారు.. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ అరుదైైన, చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు..
ఆస్కార్ ఏమీ అంత ఈజీగా రాలేదు.. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ముఖ్యంగా రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఎంతో కృషి చేశారు.. కోటాను కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాల్లో సినిమాను ప్రదర్శించి.. కమిటీ దృష్టిలో పడేలా చేశారు.. రామ్ – భీమ్ కూడా అక్కడి మీడియాతో, అభిమానులతో, సినీ ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు.. పలు టీవీ షోలలోనూ పాల్గొన్నారు.. వారిచేత ఎంత వరకు చేయించాలో అంత ప్రమెషనూ చేయించారు.. ఎట్టకేలకు హిస్టరీ క్రియేట్ చేశారు..
‘నాటు నాటు’ ఆస్కార్ విషయంలో ప్రశంసలు ఎలానో అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి.. కొందరు సాధారణ నెటిజన్స్ మాత్రం డబ్బులిచ్చి అవార్డ్ కొనుక్కున్నారని కామెంట్స్ చేస్తున్నారు.. తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అని వీళ్లని ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, క్లోజ్ ఫ్రెండ్ అయిన షాన్ ముట్టతిన్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.. ‘‘హహా.. ఇది చాలా ఫన్నీ.. ఇప్పటివరకు ఇండియాలో మాత్రమే అవార్డ్స్ కొనుక్కోవచ్చని అనుకున్నాను.. కానీ, ఇప్పుడు ఆస్కార్స్‌లో కూడా అలానే.. డబ్బులుంటే ఆస్కార్ కూడా కొనేయొచ్చు Lol’’ అంటూ ఓ పోస్ట్ కింద కామెంట్ పెట్టాడు..
ఇక షాన్ ముట్టతిన్ని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.. ‘మీ బాలీవుడ్లోనే ఎక్కువగా అవార్డులు కొంటారు’.. అంటూ రివర్స్ పంచెస్ ఇస్తున్నారు.. అయితే షాన్ ‘ఆర్ఆర్ఆర్’ ని ఆడిపోసుకోవడానికి గల కారణం ఏంటంటే.. జాక్వెలిన్ నటించిన ‘టెల్ ఇట్ లైక్ ఎ వుమెన్’లోని ‘అప్లాజ్’ కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కి పోటీ పడింది.. దాన్ని వెనక్కి నెట్టి మరీ ‘నాటు నాటు’ ఆస్కార్ సాధించడం తనకి మింగుడుపడక ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నాడు..