Ram Charan: రామ్‌చరణ్‌పై స్టార్‌ క్రికెటర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌..

హీరో.. స్టార్‌ హీరో అవ్వడానికి మంచి హిట్లు రెండు, మూడు పడితే చాలు. స్టార్‌ హీరో పాన్‌ ఇండియా హీరో అవ్వడానికి ఓ పాన్‌ ఇండియా సినిమా చేసి విజయం అందుకుంటే చాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడానికి మాత్రం ఓ కింగ్‌ సైజ్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టాల్సిందే. అలాంటి విజయం అందుకున్న హీరోల్లో రామ్‌చరణ్‌ (Ram Charan) ఒకడు. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో (RRR) చరణ్‌ ఆ విజయం అందుకున్నాడు. ఆ సినిమా విజయం సాధించిన విధానం వల్ల చరణ్‌కు ఇప్పుడు అన్ని రంగాల ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.

Ram Charan

తాజాగా ప్రముఖ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా చరణ్‌ (Ram Charan) గురించి గొప్పగా చెప్పాడు. ఇండియన్‌ క్రికెటర్‌గా రైనా ఎంత పేరు సంపాదించాడో.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రికెటర్‌గానూ అంతే పేరు అందుకున్నాడు. ఆయనే ఇప్పుడు రామ్‌ చరణ్‌ గురించి గొప్పగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అవుతున్నాయి. రైనా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్ అలగ్ యాక్టర్ హై అంటూ పొగిడేశాడు. అంటే రామ్ చరణ్ (Ram Charan) వేరే లెవెల్ నటుడు అని అన్నాడన్నమాట.

తనకి ఇష్టమైన నటుల్లో రామ్ చరణ్ కూడా ఒకరు అని చెప్పిన రైనా.. చరణ్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చేలా మాట్లాడాడు. తమ హీరో గురించి తమ అభిమాన క్రికెటర్‌ మాట్లాడటం చూసి వాళ్లు మురిసిపోతున్నారు. అలా ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మొన్నీ మధ్య ఫ్రెంచ్‌ హీరో లూకాస్ బ్రావో కూడా. రామ్‌ చరణ్‌ను మెచ్చుకున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించాడు.

యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఆకట్టుకున్నాడు అని ప్రశంసించారు. ఇక 2022లో విడుదలైన ఈ సినిమా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా తీసుకొస్తారు.

పెద్ద సినిమాలు అయినా సరే అదే పద్ధతి ఫాలో అవ్వాలట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus