Sneha: ఆ కారణంతోనే దర్శకుడు స్నేహని ఘోరంగా కొట్టాడట..!

సుహాసిని రాజారాం నాయుడు అలియాస్ స్నేహని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2001 లో వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్నేహ. అటు తరువాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటూ..సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ఉండేది స్నేహ. కచ్చితంగా ఈమె టాలీవుడ్లో మరో సౌందర్య అవుతుంది అని అంతా అనుకున్నారు.

అందుకు తగ్గట్టే సౌందర్య కోసం అనుకున్న పాత్రలు ఈమెకు దక్కిన సందర్భాలు ఉన్నాయి. ‘శ్రీరామదాసు’ ‘పాండురంగడు’ వంటి సినిమాల్లో సౌందర్యను అనుకున్న కె.రాఘవేంద్రరావు… స్నేహని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయినా సౌందర్య రేంజ్లో అయితే స్నేహ సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా.. స్నేహని ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న టైంలో ఓ దర్శకుడు రక్తం వచ్చేలా కొట్టాడట.ఆ దర్శకుడు ఎవరంటే సుశీ గణేషన్.

కెరీర్ ప్రారంభంలో ఇతని దర్శకత్వంలో స్నేహ ఓ సినిమా చేసింది. అందులో ప్రశాంత్ హీరో. షూటింగ్ టైంలో స్నేహ.. ప్రశాంత్ తో ప్రేమలో పడిందట. అయితే ఆమెకు తెలియకుండా దర్శకుడు సుశీ గణేషన్ కూడా స్నేహని ప్రేమించాడట. కానీ స్నేహ.. ప్రశాంత్ ను లవ్ చేస్తుందని తెలుసుకుని..

సీన్ చిత్రీకరణ సమయంలో స్నేహ (Sneha) సరిగ్గా చేయడం లేదనే వంక పెట్టుకుని ఆమెని రక్తం వచ్చినట్టు కొట్టాడు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ తమిళంలో కాస్త ఇమేజ్ ఉన్న దర్శకులు కొత్తగా వచ్చే హీరో హీరోయిన్లను చిత్ర హింసలు పెడతారు అనే ప్రచారం మాత్రం రెండు దశాబ్దాలుగా ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus