సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుస విడాకులతో టాప్ సెలబ్రెటీలు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడు బాలా కూడా అతని భార్య ముత్తుమలర్ కు విడాకులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిండిమ్. మార్చి 5న ఫ్యామిలీ కోర్టు నుంచి వీరు విడాకులు తీసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట హఠాత్తుగా విడిపోవడం కోలీవుడ్ సినీ ప్రముఖులను ఆశ్చర్యపరిచింది. అయితే వీరు నాలుగేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి.
చాలా సంవత్సరాల క్రితం దర్శకుడు బాలా, మలర్ మధ్య విభేదాలు తలెత్తాయి. బాలా తన పనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు, మలర్ తరచుగా జయం రవి భార్య ఆర్తి, గాయని సైంధవి మరియు పరిశ్రమకు చెందిన ఆమె స్నేహితులతో తిరుగుతూ కనిపించింది. అప్పుడే విబేధాలు వచ్చినట్లు టాక్ వచ్చింది. చివరికి దర్శకుడు బాలా, మలర్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో వారి విడాకులు తీసుకున్నారు.
దర్శకుడు బాలా మరియు ముత్తుమలర్ జూలై 5, 2004న మధురైలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కూతురు కూడా ఉంది. బాలా, మలర్‌ల విడాకుల వార్త పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత ఇలా విడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది బాల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు బాలా సినిమాల విషయానికి వస్తే శివపుత్రుడు, నేనే దేవుణ్ణి, వాడు వీడు అనే విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు.
పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. గత కొంత కాలంగా దర్శకుడు వరుస అపజయాలు చూడాల్సి వస్తోంది. ఇక ప్రస్తుతం హీరో సూర్య తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టులో బిజీగా ఉండగానే అతని విడాకులపై కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!