ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న మెగాస్టార్..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. రీఎంట్రీలో రీమేక్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా బైరెడ్డి అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

జనవరి 21వ తేదీన లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా కరోనా కేసులు తగ్గిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం లూసిఫర్ దర్శకనిర్మాతలు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను సంప్రదించారని సమాచారం. అయితే అనురాగ్ కశ్యప్ మాత్రం లూసిఫర్ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్ నో చెప్పడంతో లూసిఫర్ దర్శకనిర్మాతలు కొత్త విలన్ ను వెతికే పనిలో పడ్డారు.

2022 సంక్రాంతి పండుగకు లూసిఫర్ రీమేక్ ను రిలీజ్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. త్వరలో లూసిఫర్ రీమేక్ కు సంబంధించిన కీలక అప్ డేట్ కూడా రానుందని ఫ్యాన్స్ కు మెగాస్టార్ సినిమాకు సంబంధించి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆచార్య మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత మొదట ఈ సినిమా షూటింగ్ లోనే చిరంజీవి పాల్గొననున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ లో, బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus