బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్ధర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ముంబై క్రూజ్ షిప్ పై అక్టోబర్ 2 రాత్రి పోలీసులు దాడి చేయగా.. ఈ పార్టీలో ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, పూజాబేడీలతో పాటు పలువురు మద్దతు తెలిపారు.
ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మూడు సార్లు ఆర్యన్ బెయిల్ రిజెక్ట్ అయింది. బెయిల్ దొరక్కపోవడంతో ఆర్యన్ మానసికంగా దిగ్బ్రాంతికి లోనవుతున్నాడు. జైల్లో ఉన్న కొడుకుని చూసి షారుఖ్ ఖాన్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయంలో బాలీవుడ్ సైలెంట్ గా ఉండడం సిగ్గు చేటు అంటూ దర్శకనిర్మాత సంజయ్ గుప్తా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆర్యన్ అరెస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్న పలువురు బాలీవుడ్ పెద్దలను ఆయన ప్రశ్నించారు.
షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారని.. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతీ విషయంలో షారుక్ ముందుంటారని.. అలాంటి ఆయన సంక్షోభ పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండడం సిగ్గుచేటు అంటూ రాసుకొచ్చారు. ”ఈరోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్లు లేదా మీ వాళ్లు ఉండొచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా..?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?