నందమూరి బాలకృష్ణ పై ఈ మధ్య పెద్ద దర్శకుల ఫోకస్ పడిందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ‘జై సింహా’ తో ఓ కమర్షియల్ హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి డిజాస్టర్లు మూటకట్టుకున్నాడు. ఈ మధ్యనే ‘అఖండ’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనుకోండి. కానీ పాండమిక్ మరియు ఏపిలో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యు వల్ల ఈ సినిమా ఇంత భారీగా కలెక్ట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఊహించనిదే అద్భుతం అంటారు..
‘అఖండ’ మూవీ బాలయ్య-బోయపాటి కలయికలో వచ్చింది కాబట్టి ఆ సినిమాకి ఆ మాత్రం స్టామినా ఉంటుందనే కాన్ఫిడెన్స్ ముందు నుండీ అందరిలో ఉంది..! ఇది పక్కన పెడితే.. ‘అఖండ’ విడుదల కాకుండానే బాలయ్యతో సినిమాలు చేయడానికి టాప్ డైరెక్టర్లు ఎగబడిన సంగతి తెలిసిందే. ‘క్రాక్’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు.. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ కంటే ముందే ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని భావిస్తున్నాడు.
అందులో బాలయ్య-సాయి ధరమ్ తేజ్ నటిస్తారని టాక్. పూరి అయితే ఎప్పటినుండో బాలయ్యతో సినిమా చేయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్ కూడా చేరాడని టాక్. ఆ టాప్ డైరెక్టర్ నిర్మాత దిల్ రాజుని అప్రోచ్ అయ్యి బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట. నిజానికి బాలయ్య ఎంత పెద్ద హిట్టు కొట్టినా భారీ పారితోషికం అయితే తీసుకోడు. అలాగే బాలయ్యతో కరెక్ట్ సినిమా చేస్తే అది బ్లాక్ బస్టర్ కొట్టడం.. జరుగుతుంది. అందుకే టాప్ డైరెక్టర్లంతా బాలయ్య పై కన్నేసినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!