సినిమా ఇండస్ట్రీ మన రెగ్యులర్ ప్రపంచానికి పూర్తిగా బిన్నంగా ఉంటుంది అని అందరూ అంటుంటారు. ఈ రంగుల ప్రపంచం లో అనుకున్న స్థాయికి ఎదగాలంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ వదిలేయాలి. ఒక కొత్త ప్రపంచం లో ఉండే అలవాట్లను ఆస్వాదించడానికి అన్నీ విధాలుగా సిద్ధం అవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలరు. కానీ ఏ ఇండస్ట్రీ లో కూడా జరగని ఒక వింత సంఘటన మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో జరిగింది.
అతను ఒక పెద్ద సూపర్ స్టార్, అతని సినిమాలకు అప్పట్లో ఆడియన్స్ క్యూలు కట్టేవారు. ఆయన ఒక ప్రముఖ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లాడాడు. పెళ్ళైన తర్వాత ఆ స్టార్ హీరోకి పెద్దగా సినిమాల్లో కలిసి రాలేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే అతనికి కూతురు పుట్టిందో, అప్పటి నుండి అతనికి అన్నీ బాగా కలిసొచ్చాయి. కేవలం హీరో గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆ స్టార్ హీరో నిలదొక్కుకున్నాడు.
అలా కాలం గడుస్తూ ఆ హీరో కూతురు పెద్దది అయ్యి , సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ సొంత టాలెంట్ తోనే అవకాశాలు సంపాదించుకొని, పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. కేవలం మలయాళం సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిచయం కాకుండా, తెలుగు , హిందీ మరియు తమిళ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయం లోనే తండ్రి కూడా ఇంకా (Star Hero) స్టార్ స్టేటస్ తో కొనసాగుతూ హీరో గా నటిస్తూ ముందుకెళ్తున్నాడు. ఒకానొక సమయం లో ఒక మంచి కథ లో నటించే అవకాశం వచ్చింది ఆ స్టార్ హీరో కి, దర్శక నిర్మాతలు ధైర్యం చేసి ఈ చిత్రం లో హీరోయిన్ గా మీ కూతురినే అనుకుంటున్నాము అని అన్నారట. ఒక్కసారిగా ఆ స్టార్ హీరో కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
మొదట్లో నటించడానికి ఒప్పుకోకపోయినా, ఆ తర్వాత ఒప్పుకొని నటించారు. సినిమా బాగున్నప్పటికీ కూడా ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కారణం తండ్రీ కూతుర్లు కలిసి హీరో హీరోయిన్లు గా నటించడమే. అప్పట్లో వీళ్ళిద్దరూ తీవ్రమైన విమర్శల పాలయ్యారు కూడా. ఇద్దరు కెరీర్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్