ఆ హీరోయిన్ తో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన హీరో!

“గబ్బర్ సింగ్” (Gabbar Singh) సినిమాలో ఐటెం సాంగ్ లో నర్తించిన మలైకా అరోరా గురించి తెలియనివాళ్లు ఉండరు. సల్మాన్ ఖాన్ (Salman Khan) మరదలిగా, అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) భార్యగా కంటే, అర్జున్ కపూర్ (Arjun Kapoor) గర్ల్ ఫ్రెండ్ గా ఎక్కువ పాపులర్ అయ్యింది మలైకా అరోరా (Malaika Arora) . సల్మాన్ ఖాన్ వద్దకి యాక్టింగ్ క్లాసెస్ కోసం వచ్చిన అర్జున్ కపూర్ ను వలలో వేసుకొని అతడి ఎఫైర్ కారణంగా ఏకైకా వైవాహిక జీవితానికి స్వస్తి పలికి, విడాకులు తీసుకొని మరీ అర్జున్ కపూర్ తో సహజీవం మొదలు పెట్టింది మలైకా అరోరా.

Arjun Kapoor

దాదాపుగా ఆరేళ్లపాటు సహజీవం చేసిన మలైకా అరోరా & అర్జున్ కపూర్ (Arjun Kapoor) పెళ్లి కూడా చేసుకుంటారేమో అనుకున్నారు చాలామంది. కట్ చేస్తే.. ఈ ఇద్దరు గత కొన్ని నెలలుగా వేరుగా ఉండడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మలైకా తండ్రి మరణం అనంతరం అర్జున్ కపూర్ ఆమెకు పూర్తిగా దూరమయ్యాడు. అయితే.. ఈ విషయమై మలైకా ఇప్పటియావరకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ, అర్జున్ కపూర్ మాత్రం నిన్న ఓ పబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ‘మలైకా ఎక్కడ?’ అని ప్రశ్నించగా..

“నేను ఇప్పుడు సింగిల్” అని సమాధానం చెప్పాడు అర్జున్ కపూర్. దాంతో.. మలైకా & అర్జున్ కపూర్ ల బంధం సహజీవనం స్టేజ్ లోనే ఆగిపోయిందని క్లారిటీ వచ్చింది జనాలకి. మరి ఇప్పుడు 51 ఏళ్ల మలైకా అరోరా ఈ లేటు వయసులో ఎవరి పంచన చేరుతుందో చూడాలి. ఇకపోతే.. హీరోగా హిట్ కొట్టడానికి విశ్వప్రయత్నం చేసి, అది సక్సెస్ అవ్వకపోవడంతో,

ఇప్పుడు విలన్ గా మారి “సింగం ఎగైన్” (Singham Again) తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అర్జున్ కపూర్ ఈ కొత్త జీవితంలో ఎవర్ని తన కొత్త పార్ట్నర్ గా ఎనౌన్స్ చేస్తాడా అనే విషయంలోనూ ఆసక్తి నెలకొంది. ఇకపోతే.. గత కొంతకాలంగా పాపులర్ కపుల్స్ అందరూ విడాకులు ప్రకటిస్తూ వస్తుండగా, ఇప్పుడు మలైకా & అర్జున్ కపూర్ ల జంట సహజీవనం నుండి బ్రేకప్ చెప్పడం అనేది చర్చనీయాంశంగా మారింది.

చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. కార్యక్రమం హైలైట్స్‌ ఇవే.. స్టార్లు చెప్పిన విషయాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus