Balakrishna, Anil Ravipudi: అనిల్ మారతారా.. బాలయ్యను మారుస్తారా..?

  • June 14, 2021 / 11:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో కొత్త సినిమాలకు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిటయ్యారు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య అనిల్ రావిపూడి సినిమా ప్రకటన రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందా..? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా జూమ్ మీటింగ్ లో అభిమానులతో మాట్లాడిన బాలకృష్ణ తన భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే నటిస్తున్నానని బాలయ్య స్పష్టం చేశారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా ఉండగా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా పూర్తైన వెంటనే బాలయ్య అనిల్ కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.

అయితే బాలకృష్ణ ఎక్కువగా యాక్షన్ కథాంశాలను ఇష్టపడతారు. అనిల్ రావిపూడి మాత్రం తన కథలలో కామెడీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. బాలయ్య స్టైల్ లో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తారా..? లేక అనిల్ రావిపూడి స్టైల్ లో బాలయ్య సినిమా తెరకెక్కుతుందా..? అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు బాలయ్య పది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus